నెల్లూరు జిల్లాలో స్థానిక సమరం రసవత్తరంగా మారింది. జిల్లాలో 10కి 10 ఎమ్మెల్యే స్థానాలు జిల్లా పరిధిలోకి వచ్చే 2 పార్లమెంట్ స్థానాలు వైసీపీవే. అయితే స్థానిక సమరంలో ఆ స్థాయి విజయాలు దక్కే అవకాశాలు తక్కువగానే కనిపిస్తున్నాయి. అటు టీడీపీ మాత్రం సమరానికి సై అంటోంది. జిల్లాలో పార్టీకి పెద్దగా వ్యవహరిస్తున్న మాజీ మంత్రి సోమిరెడ్డి ఆధ్వర్యంలో ఈ ఎన్నికలను ఎదుర్కోబోతున్నాయి టీడీపీ శ్రేణులు. అటు బీజేపీ, జనసేన కూడా నెల్లూరు జిల్లాలో బలపడేందుకు కృషి చేస్తున్నాయి. ఈ దశలో స్థానిక సమరం ఆసక్తిగా మారింది.