వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుక పాలసీని మార్చడంతో రేట్లు భారీగా పెరిగాయి. సామాన్యులకు ఇసుక అందుబాటులో లేకుండా పోయింది. ఇదే దశలో ప్రభుత్వం ఇసుక పాలసీని పదే పదే మార్చినా ఫలితం లేదు. ఆన్ లైన్ తో పారదర్శకత తీసుకొస్తామని అన్నా కూడా అది సాధ్యం కాలేదు. ఆన్ లైన్ విధానం వల్ల మరిన్ని కష్టాలు ఎదుర్కొంటున్నారు సామాన్యులు. దీంతో ఇసుక విధానంలో సమూల మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.