తెలంగాణలో ఉద్యోగాల భర్తీకోసం సీఎం కేసీఆర్ వరమిచ్చినా.. ఉన్నతాధికారులు మాత్రం పోస్ట్ ల భర్తీ ప్రక్రియను పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో వేలమంది ఉపాధ్యాయ ఉద్యోగార్థులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. 2014లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. టెట్ నిర్వహించారు. ఈ అర్హత ఉంటేనే డీఎస్సీ రాయడానికి అర్హులుగా పరిగణిస్తారు. అయితే టెట్ ఎలిజిబిలిటీ కేవలం ఏడేళ్లు మాత్రమే. అంటే 2014లో పరీక్ష రాసి పాసైన విద్యార్థులు ఈ ఏడాది డీఎస్సీ ఆలస్యంగా పెడితే నష్టపోతారు. దీంతో డీఎస్సీ నోటిఫికేషన్ త్వరగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఉపాధ్యాయ పోస్ట్ ల కోసం పోటీ పడుతున్న అభ్యర్థులు.