కొవిడ్ పరీక్షల విషయంలో ఇతర రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా నిలిచిన ఏపీ.. కొవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో మాత్రం పూర్తిగా వెనకపడింది. తొలి విడతలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో పని చేసే 3.88 లక్షల మంది ఆరోగ్య సిబ్బందికి టీకాలు వేయాలని ఏపీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కాగా సోమవారం వరకు 40.88% మంది మాత్రమే టీకా తీసుకున్నారు. అంటే టీకా ప్రక్రియ ప్రారంభమైనా ఇంకా 59.12మంది వ్యాక్సినేషన్ కు దూరంగా ఉన్నారు. ఈ లెక్కన టీకా ప్రక్రియలో ఏపీ బాగా వెనకపడిందనే చెప్పాలి.