పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ పంచాయతీలను ఏకగ్రీవాలుగా మార్చాలని వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. అలా జరగకుండా అడ్డుకునేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వ్యూహరచన చేస్తున్నారు. ఏకగ్రీవాల అడ్డుకట్టకు ఐజీ స్ధాయి ఐపీఎస్ అధికారి డాక్టర్ సంజయ్‌ను ప్రత్యేక అధికారిగా నియమించడం, ఆయన బాధ్యతలు చేపట్టడం జరిగిపోయాయి. ఇంతకీ ఈ సంజయ్ ఎవరు ? ఏకగ్రీవాలను అడ్డుకునేందుకు ఆయనేం చేయబోతున్నారనేది రాజకీయ వర్గాల తో పాటుగా , ప్రజల్లో కూడా ఆసక్తి మొదలైంది.