ఏపీలో పంచాయితీ ఎన్నికల పోరు బాగా హాట్ హాట్‌గా సాగేలా కనిపిస్తోంది. 2019 సాధారణ ఎన్నికల తర్వాత జరుగుతున్న ఎన్నికలు కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు దృష్టి పెట్టాయి. ప్రధానంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు ఈ పంచాయితీ పోరులో హోరాహోరీగా తలపడనున్నాయి. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా ఈ స్థానిక పోరు ఏకపక్షంగా సాగేలా కనిపించడం లేదు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జగన్ వేవ్ స్పష్టంగా ఉంది. దీంతో ప్రజలు ఫ్యాన్ వైపుకు వెళ్లారు.