కృష్ణా జిల్లా నిమ్మకూరు గ్రామం...టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారకరామారావు పుట్టిన గడ్డ. ఈ గ్రామం ప్రస్తుతం పామర్రు నియోజకవర్గ పరిధిలో ఉంది. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ పామర్రు నియోజకవర్గంలో టీడీపీ ఇంతవరకు విజయం సాధించలేదు. 2009లో కాంగ్రెస్ గెలిస్తే, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసిన అనిల్ కుమార్ దాదాపు 30 వేల పైనే ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.