జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న అది పెద్ద సంచలన నిర్ణయం ఏదైనా ఉందంటే అది మూడు రాజధానుల ఏర్పాటు. ప్రాంతాల మధ్య గొడవలు రాకూడదని, రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలు అభివృద్ధి జరగాలని చెప్పి సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులని ఏర్పాటు చేసే నిర్ణయం తీసుకున్నారు. అయితే పైకి అభివృద్ధి అని చెబుతున్నా కూడా అమరావతిని రాజధానిగా కొనసాగిస్తే చంద్రబాబుకే పేరు వస్తుందని, పైగా అమరావతిలో టీడీపీ హవా ఎక్కువగా ఉంటుందని చెప్పి జగన్ మూడు రాజధానులని తెరపైకి తీసుకొచ్చారు అనే విమర్శలు కూడా లేకపోలేదు.