గృహహింస, ప్రేమ, వరకట్న వేధింపులు, లైంగికదాడులు నిత్యం ఏదో ఒక చోట నుంచి వినాల్సి వస్తోంది. కన్న వాళ్ళను కాదనుకొని, తాళి కట్టిన భర్తే సర్వస్వం అనుకోని మెట్టినింటికి వస్తుంది. కానీ ఆమె ఆశలకు నీరుగారుస్తూ చివరకు వేధింపులతోనే భర్త వారిపైకి యమపాశం వదులుతున్నాడు. వరకట్న దాహాగ్నిలో అబలలు ఆహుతులవుతూనే ఉన్నారు. తాజాగా కరీంనగర్ జిల్లాలో నవ వధువు వరకట్న పిశాచానికి బలైంది. వరకట్న వేధింపులతో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికలో చోటుచేసుకుంది.