మనిషి చనిపోతే కూడా విలువ ఇవ్వని నేటి సమాజంలో ఒక్క వీధి కుక్క మరణంతో ఆ ప్రాంతంలో విషాదం నెలకొంది. కొన్ని రోజులుగా ఆ కాలనీ వాసులంతా సంతాపం పాటిస్తున్నారు. ఇక కుక్క మృతికి సంతాపంగా పోస్టర్లు కూడా వెలిశాయి. మనకు తెలిసినంత వరకు మనిషి చనిపోతే పోస్టర్లు వేస్తారు.. మరి కుక్క మరణిస్తే పోస్టర్లు వెలియడమేంటీ? కేరళలోని పథానమ్తిట్టా జిల్లా మనక్కల వాసులను ఇదే విషయం గురించి ప్రశ్నిస్తే.. అదంతే అని చెప్తున్నారు.