చిత్తూరులో ఈ ఘటన జరిగింది. బి.కొత్తకోటలో మరో క్షుద్రపూజల కలకలం రేగింది. క్షుద్రపూజల ముసుగులో తమ కుమార్తెను మోసపూరిత పెళ్లి చేసుకున్నారని అబ్బాయి, భూతవైద్యునిపై అమ్మాయి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తెను లోబర్చుకుని చరణ్ అనే యువకుడు పెళ్లి చేసుకున్నాడని యువతి తల్లిదండ్రులు వాపోయారు. పెళ్లి తర్వాత ఇప్పుడు వరకట్న వేధింపులకు గురి చేస్తున్నాడని చెబుతున్నారు. క్షుద్ర పూజల వైద్యం చేసిన వెంకటరెడ్డి, చరణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు