ఆంధ్రప్రదేశ్ లో పంచాయితీ ఎన్నికల వేడి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా ఎన్నికలకు ససేమిరా అన్న జగన్ సర్కార్ ఇప్పుడు కోర్టు తీర్పు కారణంగా ఎన్నికలు జరగడానికి ఒప్పుకున్నారు. అయితే ఈ ఎన్నికలు అనుకూలంగా మార్చుకునేందుకు పావులు కదుపుతున్నారు. అంతేకాదు నిమ్మగడ్డ పై తీవ్ర ఆరోపణలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా మరో వైసీపీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌పై విమర్శలు గుప్పించారు.