కేసీఆర్ అసెంబ్లీలో ఒకటి చెప్పారు, బయట ముదిరాజ్ ల ఆత్మీయ సభలో మంత్రి తలసాని మరోటి చెప్పారు. ఈ రెండు పరస్పర విరుద్ధ ప్రకటనలు ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపాయి. మంత్రి తలసాని శ్రీనివాస్ పదవికే ముప్పు తెచ్చేలా ఉన్నాయి. రాష్ట్రంలోని చెరువులు, చేపలపై మత్స్యకారులకే హక్కులు ఉంటాయని చెప్పగా.. ముదిరాజ్ లకు సర్వాధికారాలుంటాయని ఇటీవల తలసాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. పదే పదే తలసాని క్షమాపణలు చెప్పుకుంటున్నా కూడా బెస్తవారి ఆగ్రహం చల్లారలేదు. ఆయనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.