పంచాయతీలన్నీ ఏకగ్రీవం కావాలి.. అందరూ ఒకేతాటిపైకి వచ్చి మీ సర్పంచిని ఏకగ్రీవంగా ఎన్నుకోండి, ఎన్నికలకు పోకండి అంటూ గత కొన్నిరోజులుగా అధికార పక్ష నాయకులు చెబుతూ వస్తున్నారు. అనంతరం ప్రభుత్వం తరపున ఏకగ్రీవ పంచాయతీలకు ఇచ్చే నగదు ప్రోత్సాహకాలను పెంచుతూ ప్రకటన వచ్చేసింది. దీనిపై సీరియస్ అయిన ఎన్నికల కమిషన్ సమాచార శాఖ వివరణ కోరింది.