రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. అయితే మంత్రులు, వైసీపీ నేతలు మాత్రం సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని చెబుతూనే.. మరోవైపు నిమ్మగడ్డ పై నిప్పులు చెరుగుతున్నారు. చల్లగా ఉన్న రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితి రావడానికి నిమ్మగడ్డ నే కారణమంటూ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. కరోనాతో ప్రజలు ఇబ్బంది పడితే నిమ్మగడ్డనే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అంతేకాదు నిమ్మగడ్డ రమేశ్‌కుమార్, టీడీపీ అధినేత చంద్రబాబు తొత్తని ఆరోపించారు. చంద్ర బాబు చేతిలో నిమ్మగడ్డ కీలు బొమ్మలా మారాడు. అతని ప్రయోజనాలా కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నారని ఎంపి ద్వజమెత్తారు.