తెలంగాణ విద్యాశాఖ తరపున అధికారిక ఉత్తర్వులు రావడంతో.. గురుకుల పాఠశాలల అధికారులు హాస్టల్ చదువులకోసం తల్లిదండ్రుల అనుమతిని తప్పనిసరి చేస్తున్నారు. పాఠశాలకు రావడంకోసమే కాదు.. ఒకవేళకరోనాబారిన పడితే చికిత్స విషయంలో కూడా ఇప్పుడే క్లారిటీ తీసుకుంటున్నాయి. గురుకులాలలో చదివే విద్యార్థులు కరోనా బారిన పడితే, చికిత్స ఎవరు చేయించాలి, ఎలా చేయించాలి, తిరిగి ఎప్పుడు స్కూల్ లేదా కాలేజీకి రావాలి.. అనే విషయాలపై ముందుగానే అంగీకార పత్రాలను తీసుకుంటున్నారు అధికారులు. అవి లేకపోతే అనుమతి లేదని ఖరాకండిగా చెప్పేస్తున్నారు.