ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల ఏకగ్రీవం కోసం ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇవ్వటం పై పెద్ద కుట్ర ఉందని బీజేపీ-జనసేన నేతలు ఆరోపించారు..పార్టీని బలోపేతం చేసుకునేందుకు బలవంతంగా ఏకగ్రీవాలు చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాగా, నిన్న ఈ విషయం పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన రాజకీయవ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 'పంచాయతీ ఎన్నికల్లో భారీగా లబ్ధి పొందేందుకు రాష్ట్ర ప్రభుత్వం చరిత్రలో ఎన్నడూలేని విధంగా ప్రకటనలు ఇస్తోందని అన్నారు.. ఈ కుట్రలను ఎన్నికల కమిషన్ అడ్డుకోవాలి.