13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా ఆ దొంగ బుద్ధి మారలేదు. ఎప్పటిలాగే చోరీలకు పాల్పడుతూ పోలీసులకు పట్టుబడ్డాడు. బైకులు, సెల్ఫోన్లు దొంగలిస్తున్న నిందితుడిని చౌటుప్పల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లాలోని చౌటుప్పల్ ఏసీపీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఏసీపీ సత్తయ్య వెల్లడించారు.