గుంటూరు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం...దివంగత కోడెల శివప్రసాద్ అడ్డా. డాక్టర్ వృత్తి నుంచి ఎన్టీఆర్ పిలుపుతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల..నరసారావుపేట అసెంబ్లీ బరిలో వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధింకారు. 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో కోడెల గెలిచారు. ఇక 2004, 2009 ఎన్నికల్లో ఓడిన కోడెల 2014 ఎన్నికల్లో నరసారావుపేట వదిలేసి, సత్తెనపల్లి వెళ్ళి అక్కడ విజయం సాధించారు. ఇక 2019లో ఓడిపోయాక అనూహ్య రీతిలో కోడెల ఆత్మహత్య చేసుకుని తనువు చాలించిన విషయం తెలిసిందే.