కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో మంత్రి కొడాలి నానికి చెక్ పెట్టడం ప్రత్యర్ధులకు సాధ్యం కావడం లేదు. వరుసగా గుడివాడలో గెలుస్తూ వస్తున్న నాని ముందు టీడీపీ తేలిపోతుంది. 2014లో అధికారంలో ఉండి కూడా టీడీపీ...నానికి చెక్ పెట్టలేకపోయింది. ఇక ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉంది. నాని మంత్రిగా ఉన్నారు. దీంతో ఇక్కడ నానికి చెక్ పెట్టడం టీడీపీ వల్ల అయ్యేలా కనిపించడం లేదు.