ఏపీలో పంచాయితీ పోరు ఎట్టకేలకు మొదలైన విషయం తెలిసిందే. పంచాయితీ పోరులో సత్తా చాటాలని అన్ని రాజకీయ పార్టీలు చూస్తున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు హోరాహోరీగా తలపడనున్నాయి. అయితే అధికారంలో ఉండటం వల్ల వైసీపీదే పైచేయి అయ్యేలా కనిపిస్తోంది. కానీ కొన్నిచోట్ల టీడీపీ కూడా స్ట్రాంగ్‌గా ఉంది. పంచాయితీ ఎన్నికల్లోనే వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేలా టీడీపీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు.