ఎన్నో అంచనాలతో 2019 ఎన్నికల బరిలో దిగిన పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. జనసేన అభ్యర్ధులు ఎక్కడికక్కడే చిత్తుగా చిత్తుగా ఓడిపోయారు. ఆఖరికి పవన్ కల్యాణ్ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోయారు. ఇన్ని ఓటముల మధ్య జనసేన కార్యకర్తలకు ఊరటనిచ్చిన అంశం ఏదైనా ఉందంటే.. అది రాజోలులో జనసేన తరుపున రాపాక వరప్రసాద్ గెలవడం.