శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఫ్యామిలీ హవా ఉంటుందనే సంగతి తెలిసిందే. దశాబ్దాల పాటు టీడీపీలో కీలక పాత్ర పోషిస్తున్న కింజరాపు ఫ్యామిలీకి పంచాయితీ ఎన్నికలు పెద్ద సవాల్‌గా మారాయి. అందుకే బాబాయ్-అబ్బాయ్‌లు జిల్లాలో టీడీపీ మెజారిటీ పంచాయితీలు గెలిచేలా వ్యూహాలు రచిస్తున్నారు. ఎప్పటినుంచో అచ్చెన్నాయుడు-రామ్మోహన్ నాయుడులు సిక్కోలులో దూకుడుగా పనిచేస్తున్నారు.