2019-20 విద్యా సంవత్సరంలో పదో తరగతి చదివిన వారిపై ఇప్పటికే కరోనా బ్యాచ్ అనే ముద్ర పడిపోయింది. పరీక్షలు లేకుండా అందరూ పాసయ్యారనే చిన్నచూపు ఉంది. రేపు ఏ కాంపిటీటివ్ ఎగ్జామ్ కి వెళ్లినా కూడా 2020లో పాసయిన విద్యార్థులంటే కాస్త తేడాగానే చూస్తారు. ఇక ఇప్పుడు 2021 విషయానికొద్దాం. ఈ ఏడాది కూడా పరీక్ష ప్యాట్రన్ పూర్తిగా మార్చేసింది ఏపీ సర్కారు. 11 పేపర్లను 7కి కుదించింది. దీంతో ఈ బ్యాచ్ కి కూడా కరోనా బ్యాచ్ అనే ట్యాగ్ లైన్ యాడ్ అవుతుందని విద్యార్థులు భయపడుతున్నారు.