ఎన్నికలు ఏవయినా అధికార పార్టీ తరపున బరిలో దిగడానికి అభ్యర్థులు ఎక్కడలేని ఉత్సాహం చూపిస్తుంటారు. రాష్ట్రంలో అధికారం తమదే అయితే.. స్థానికంగా చక్రం తిప్పొచ్చనేది వారి ఆలోచన. స్థానిక ఎన్నికల్లో కూడా అధికార వైసీపీ తరపున పోటీ పడటానికి అభ్యర్థులు ముందుగానే పోటీపడతారని అనుకున్నారంతా. కానీ కొన్ని జిల్లాల్లో రిజర్వేషన్ల వ్యవహారం అధికార పార్టీ అభ్యర్థులను వెతుక్కోవాల్సిన పరిస్థితి కల్పించింది. నెల్లూరు జిల్లాలో ఇప్పుడు వైసీపీ ఇదే స్టేజ్ లో ఉంది. సర్పంచ్ అభ్యర్థులకోసం గాలిస్తున్నారు అధికార పార్టీ పెద్దలు.