పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఫిర్యాదులకోసం ఓ యాప్ తయారు చేసిందని, దాని ద్వారా ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటారని, వీలైతే అక్కడ ఎన్నికలను రద్దు చేసే అవకాశం కూడా ఉందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంతో అధికార వైసీపీలో ఆందోళన మొదలైంది. నిమ్మగడ్డే చంద్రబాబు మనిషి అని అంటున్న వైసీపీకి, నిమ్మగడ్డ తీసుకొచ్చే యాప్ పై ఎందుకు నమ్మకం ఉంటుంది. అందులోనూ ప్రభుత్వం తయారు చేసిన నిఘా యాప్ ని కాదని, ఎన్నికలకోసం ప్రత్యేకంగా ఎస్ఈసీ యాప్ తయారు చేయడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. దీంతో వైసీపీ అనుకూల మీడియాలో ఈ యాప్ పై ప్రత్యేక చర్చ మొదలైంది.