మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్రంలో సంచలనంగా మారాయి. పంచాయతీ ఎన్నికలకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సందర్భంలో సీఎం జగన్, అసెంబ్లీని రద్దు చేస్తానని అన్నారని, ఆ పని ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు మాజీ మంత్రి దేవినేని ఉమా. అసలింతకీ జగన్ ఆ మాటలు ఎప్పుడన్నారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుంటే, ఉత్తర కుమార ప్రగల్భాలు మాకు బాగా అలవాటేకదా అంటూ దేవినేని దెప్పిపొడుస్తున్నారు.