చంద్ర బాబు సొంత జిల్లాలో టీడీపీ కి గట్టి ఎదురు దెబ్బ తగిలిందని అర్థమవుతుంది. జిల్లాలోని నియోజక వర్గాలు ఏకగ్రీవానికి మొగ్గు చూపుతుండటం విశేషం.పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహిస్తే భారీ నజరానా ప్రకటించినప్పటికీ వాటిని విడుదల చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేయాల్సిన అనుభవం గతంలో ఉందని పలువురు మాజీ సర్పంచ్ లు అంటున్నారు. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా ఎన్నికలు పూర్తి కాగానే ఆయా పంచాయతీలకు నిధులు జమయ్యేలా నిర్ణయం తీసుకోవాలని స్థానిక సంస్థల ప్రతినిధిగా పనిచేసిన పలివెల వీరబాబు అన్నారు.తిరుపతి లో వైసీపీ ఎమ్మెల్యే లతో పంచాయతీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ విషయం పై క్లారిటీ ఇచ్చారు. ఈ మేరకు సదుం నియోజక వర్గంలో 15 కు 15 ఏకగ్రీవం అయ్యాయని తెలుస్తుంది.