రాయలసీమ జిల్లాల్లో మాత్రం వాడి వేడిగా నామినేషన్లు వేస్తున్నారు. కాగా, కడపలో మాత్రం నామినేషన్లు ఆగిపోయాయి అనే వార్తలు వినిపిస్తున్నాయి. కడప జిల్లాలోని 13 గ్రామపంచాయతీలకు ఎన్నికలు నిలిచాయి. ఇటీవల విభజన చేస్తూ 13 పంచాయతీలను ప్రభుత్వం పెంచింది. అయితే విభజనను వ్యతిరేకిస్తూ కొందరు నేతలు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన ఏపీ హైకోర్టు విభజించిన 13 పంచాయితీలకు ప్రస్తుతం ఎన్నికలు ఆపాలని స్టే ఇచ్చింది. హైకోర్టు స్టేతో 13 పంచాయతీలకు ఎన్నికలు నిలిచిపోయాయి. ఈ ఎన్నికలు మళ్లీ ఎప్పుడూ మొదలవుతాయన్నది ఆసక్తిగా మారింది..