బేకింగ్ సోడా గురించి తెలియని వారంటూ ఉండరు. బేకింగ్ సోడాని ఎక్కువగా వంట గదిలో చూస్తుంటాము. ఇక ఇది శ్వాసలో తాజాదనం నింపడానికి, దంతాలను తెల్లగా మార్చడానికి ఉపయోగపడుతుందని కూడా తెలుసు. అయితే వంటల్లో వాడే దీనిని ఎన్నో రకాలుగా వాడొచ్చు. ఇందులో చర్మ సౌందర్యానికి, ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో గుణాలు ఉన్నాయి. దీనిని వాడడం వల్ల చర్మ వ్యాధుల నుంచి బయటపడొచ్చునని నిపుణులు చెబుతున్నారు.