అన్యోన్యంగా ఉండాల్సిన భార్య భర్తలు చీటికి మాటికి గొడవలు పడి ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు మనం ఎన్నో చూశాం. అలాంటి ఘటనే నిజామాబాద్ జిల్లాలో జరిగింది. భర్త వేధింపులు తాళలేక ఆ ఇల్లాలు చావే శరణ్యమని తలచింది. అల్లారుముద్దగా పెంచిన కన్నకూతురితో సహా చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మోపల్ మండలం కులస్పూర్ గ్రామంలో చోటు చేసుకుంది.