ఇంటింటికీ ఇంటర్ నెట్ సేవలు పథకాన్ని త్వరలో తెలంగాణలో కూడా మొదలు పెట్టే ఆలోచనలో తెలంగాణ సర్కారు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఇంటర్నెట్తో అనుసంధానం చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఫైబర్‌గ్రిడ్ ప్రాజెక్టును త్వరలో పూర్తి చేసి, దాని సేవలను ప్రజలకు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు.