పవన్ కల్యాణ్ గురిచూసి దెబ్బకొట్టారు. సరిగ్గా ఎన్నికల ముందు కాపు సత్తా చూపించారు. కాపు సామాజిక వర్గ నాయకులతో భేటీ అయ్యారు. మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్య నేతృత్వంలో కాపు సంక్షేమ సేన ప్రతినిధులు జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్‌ను కలిసి సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా కాపుల రాజకీయ ఐక్యతకోసం కృషిచేయాల్సిన అవసరం గురించి పవన్ కల్యాణ్ వారికి వివరించారు. యాచించే స్థాయినుంచి శాసించే స్థాయికి కాపులు ఎదగాలని ఆకాంక్షించారు.