రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల పర్వం పేలవంగా మొదలైంది. విజయనగరం జిల్లా మినహా మొత్తం 12 జిల్లాల్లో నామినేషన్ల ప్రక్రియ మొదలు కాగా.. తొలిరోజు కేవలం 3,515 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. విజయనగరం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో మొదటి విడతలో భాగంగా 3,249 సర్పంచ్లు, 32,504 వార్డులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. అత్యథికంగా తూర్పుగోదావరి జిల్లాలో సర్పంచి స్థానాలకు 248 నామినేషన్లు దాఖలు కాగా.. అత్యల్పంగా నెల్లూరు జిల్లాలో కేవలం 27నామినేషన్లు మాత్రమే వేశారు అభ్యర్థులు. వార్డు మెంబర్ల స్థానాలకు కూడా అతి తక్కువ స్థాయిలో 46 నామినేషన్లు మాత్రమే పడ్డాయి.