రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన కార్యక్రమం ఇంటి వద్దకే రేషన్ సరకుల పంపిణీ. శ్రీకాకుళం జిల్లాలో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసి, ఇతర జిల్లాల్లోనూ అమలులోకి తేవాలని ప్రభుత్వం ఆలోచించింది. గతంలో పలు మార్లు వాయిదా పడ్డ ఈ కార్యక్రమం ఎట్టకేలకు ఫిబ్రవరి 1నుంచి అమలులోకి వస్తుందని అందరూ అనుకున్నారు. వాహనాలు సిద్ధమయ్యాయి, కార్యాచరణ రూపొందించారు. కానీ చివరికి ఎన్నికల కోడ్ ఈ కార్యక్రమానికి అడ్డుపడింది.