ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాల హడావిడి మొదలైంది. నామినేషన్ల పక్రియ మొదలవగా.. తొలిరోజు స్పందన చాలా తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో ఏకగ్రీవాలకు మార్గం సుగమం అవుతుందని అనుకుంటున్నారు. ఓవైపు ప్రభుత్వం ఏకగ్రీవాలకు భారీగా నజరానా ప్రకటించడం, మరోవైపు బలవంతపు ఏకగ్రీవాలకు ఒప్పుకునేది లేదంటూ ప్రతిపక్షాలు ఎదిరించడం చూస్తూనే ఉన్నాం. మధ్యలో ఎన్నికల కమిషనర్ కూడా బలవంతపు ఏకగ్రీవాలను ఒప్పుకోమంటున్నారు. అసలు ఒక పంచాయతీ ఏకగ్రీవం అయితే దానిని ఎలా విశ్లేషిస్తారనేదే ఇప్పుడు ప్రశ్న.