చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన కూతుళ్ల హత్యలో రోజుకో సంచలన విషయం బయటపడుతూ వస్తోంది. ఇక మూఢనమ్మకాల మైకంలో హత్యలు జరిగాయని భావిస్తున్న పోలీసులు ఆదిశగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక తండ్రి పురుషోత్తం నాయుడు, తల్లి పద్మజ మూఢనమ్మకాలతో ఈ దారుణానికి పాల్పడ్డారని భావించినా.. ఆ దారుణానికి పెద్ద కుమార్తె అలేఖ్యే అసలు కారణం అని పోలీసులు చెబుతున్నారు.