నేటి సమాజంలో చాల మంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. ఇక షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. భారతదేశంలో షుగర్ వ్యాధితో బాధపడుతున్న వారు చాలా మంది ఉన్నారు. షుగర్ కారణంగా వచ్చే ఇతర అనారోగ్యాలకి గురవుతున్నవారు అధిక సంఖ్యలోనే ఉన్నారు. ఐతే షుగర్ వ్యాధికి కారణం చక్కెర పదార్థాలని ఎక్కువగా తీసుకోవడమే నమ్ముతారు. అది నిజమే అయినప్పటికీ అదొక్కటే కారణం కూడా కాదని వైద్యులు చెబుతున్నారు.