తండ్రిని పున్నామ నరకం నుండి రక్షించే వాడు కొడుకు అని అంటుంటారు. నేటి సమాజంలో ఆస్తుల కోసం, పరువు కోసం సొంతవారిని చంపేసుకుంటున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కత్తా నగరంలో ఓ కన్న తండ్రి కర్కశంగా మారాడు. కన్నకొడుకును బాంబు పెట్టి చంపాలనుకున్నాడు. చివరికి ఊహించని విధంగా అదే బాంబుకు బలయ్యాడు. కుమారుడి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.