సచివాలయంలో పనిచేసే అందరు ఉద్యోగులు అప్రమత్తంగానే ఉండాలి. అందులోనూ ప్రతి నెలా పింఛన్ సొమ్ముని వాలంటీర్లకు అప్పగించే వెల్ఫేర్ అసిస్టెంట్ మరింత అప్రమత్తంగా ఉండాలి. విధి నిర్వహణలోనే కాదు, తన చుట్టూ ఉన్నవారిపై కూడా ఓ కన్నేసి ఉంచాలి. లేకపోతే ఇదిగో ఇలాగే అవుతుంది. పింఛన్ సొమ్ము తీసుకుని వెళ్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్, వాలంటీర్ పై దాడి జరిగిన ఘటన గుంటూరు జిల్లా పిడుగురాళ్ల మండలంలో జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలయ్యాయి. 19లక్షల రూపాయల సొమ్ము దొంగలపాలయింది.