ఇప్పటి వరకు తన నిర్ణయాలతో సీఎం జగన్ కు వరుస షాకులిస్తున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తొలిసారిగా తన చర్యలతో చంద్రబాబుని డిఫెన్స్ లో పడేశారు. వైసీపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొహమాటానికి ఆ పని చేశారా, లేక విధినిర్వహణలో తనకు ఎవరైనా ఒకటే అనే సందేశం ఇవ్వడానికి చేశారో తెలియదు కానీ.. మొత్తానికి చంద్రబాబుకి షాకిచ్చే నిర్ణయం తీసుకున్నారు నిమ్మగడ్డ. పంచాయతీ ఎన్నికలకోసం టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై ఆ పార్టీని వివరణ కోరారు.