పంచాయతీ పోరులో అధికార వైసీపీ ఏకగ్రీవాలకోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా తమ సత్తా చాటుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. రాగా పోగా.. బీజేపీ-జనసేనకు స్థానికంగా పెద్ద పట్టులేదనే విషయం ఈ ఎన్నికలతో రుజువవుతుందని కొంతమంది విశ్లేషకుల వాదన. అయితే అందరి అంచనాలకు భిన్నంగా బీజేపీ-జనసేన.. అధికార, ప్రతిపక్షాలకు వణుకు పుట్టిస్తున్నాయి. నామినేషన్ల పర్వంలో దూసుకెళ్తున్నాయి.