ఏకగ్రీవాలు, బలవంతపు ఏకగ్రీవాలంటూ ఓవైపు అధికార, ప్రతిపక్షాలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేపథ్యంలో.. సైలెంట్ గా కొన్ని గ్రామాల్లో వేలం పాటలు జరుగుతున్నాయి. నెల్లూరు జిల్లాలోని రామానాయుడు పల్లెలో వేలంపాట వ్యవహారం గుంభనంగా ఉంది. 21లక్షల 20వేలరూపాయలకు వేలం పాట జరిగిందనే వార్తలొచ్చాయి. దీనిపై మాట్లాడేందుకు ఎరూ ముందుకు రాకపోవడం విశేషం. అటు ప్రకాశం జిల్లాలో మాత్రం వేలంపాట వ్యవహారం అధికారికంగా బయటకొచ్చింది. అధికార పార్టీ నేతలు సైతం దీనిపై పెదవి విప్పారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం అడవిపాలెం పంచాయతీ సర్పంచి పదవి ఏకంగా 36లక్షలకు వేలం పాటలో అత్యథిక ధర పలకడం విశేషం.