తెలంగాణలో ఉద్యోగాల వెల్లువ ఉంటుందని నిరుద్యోగులంతా కాచుకు కూర్చున్నారు. ఇటీవల కేసీఆర్ ప్రకటన, ఆ తర్వాత అధికారుల హడావిడి చూసి భారీగా నోటిఫికేషన్లు పడతాయని అనుకుంటున్నారు. ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ విషయంలో తెలంగాణ సర్కారు గుడ్ న్యూస్ చెప్పబోతుందని అనుకుంటున్న తరుణంలో ఫిబ్రవరి 1నుంచి స్కూల్స్ తెరుచుకోబోతున్నాయి. ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఉంది. దీన్ని భర్తీ చేయాలంటే అర్జెంట్ గా విద్యా వాలంటీర్ల నియామకం చేపట్టాలని భావిస్తున్నారు కొంతమంది అధికారులు. అదే జరిగితే ఉపాధ్యాయ పోస్ట్ ల భర్తీ వెనకపడిపోతుందనడంలో ఎలాంటి అనుమానం లేదు.