చాల మందికి ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే టీలో చాల రకాలు ఉన్నాయి. అయితే చాల మంది గ్రీన్ టీని ఎక్కువగా తీసుకుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది అని అందరు అంటుంటారు. అయితే టీ లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త టీలు పుట్టుకొస్తున్నాయి. ఇక లెమన్ గ్రాస్ అనేది ఓ రకమైన గడ్డి మొక్క. దానికీ నిమ్మకాయకూ సంబంధం లేదు. కానీ అది నిమ్మకాయ వాసన వస్తుంది. అందుకే దానికి ఆ పేరు వచ్చింది. ఈ లెమన్ గ్రాస్ మన దేశ మార్కెట్లలో పెద్దగా కనిపించదు.