ఏపీలో కొద్దిరోజుల క్రితం వరుసగా విగ్రహా ధ్వంసం ఘటనలు చాలానే చోటు చేసుకున్నాయి. హిందూ దేవాలయాల్లోనే దాడులు జరుగుతుండటంతో చెడ్డపేరు వస్తోందని గ్రహించిన ప్రభుత్వం కూడా అలెర్ట్ అయింది. ఇక ఈ ఘటనలపై కేసులను వేగంగా దర్యాప్తు చేపట్టారు పోలీసులు. ఇక ముందస్తు చర్యల్లో భాగంగా ప్రధాన ఆలయాల్లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. ఒక్కో కేసును పరిష్కరిస్తూ వస్తున్నారు. తాజాగా రాజమండ్రి సుబ్రహ్మణ్య స్వామి విగ్రహద్వంసం కేసులో అసలు నిందితుడెవరన్నది పోలీసులు తేల్చేశారు.