ఏపీ పంచాయతీ ఎన్నికల్లో తొలి ఘట్టం ముగిసింది. నాలుగు విడతల్లో జరగబోతున్న ఎన్నికలకు సంబంధించి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. దాడులు, ప్రతిదాడులు, బెదిరింపులు, దౌర్జన్యాలు.. అన్నీ జరిగాయి. తీరా చివరకు 93 స్థానాలు ఏకగ్రీవం అయినట్టు తెలుస్తోంది. తొలి దశలో ఒకే ఒక నామినేషన్ తో ముగిసిన పంచాయతీల లిస్ట్ 93గా తేలింది. దీంతో ఆయా స్థానాల్లో నామినేషన్ దాఖలు చేసిన ఆ ఒకే ఒక్కరే సర్పంచ్ గా ఎన్నికయ్యే అవకాశం ఉంది.