ఈ ఏడాది కేంద్ర బడ్జెట్ లో ప్రభుత్వం కరోనా కష్ట నష్టాలను తగ్గించుకునే ప్రయత్నం చేస్తుందని అనుకుంటున్నారంతా. దానికోసం ప్రజలపై కొవిడ్ సెస్ పేరుతో భారం మోపుతారని తెలుస్తోంది. అయితే ఈ సెస్ ఎంత ఉంటుంది, ఎలా ఉంటుంది అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. కాసేపట్లో పార్లమెంట్ లో ప్రవేశబెడుతున్న బడ్జెట్ తో ఈ సెస్ పై క్లారిటీ వస్తుంది. అయితే కొవిడ్ సెస్ వాతలు భారీగా ఉంటాయని అంచనా వేస్తున్నారు ఆర్థిక నిపుణులు. ఒకవేళ కొవిడ్ సెస్ భారీగా వేసినా, అదే సమయంలో ఇతర వర్గాలకు పలు రాయితీలు ప్రకటించి వారి ఆగ్రహాన్ని తగ్గించే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.