బదిలీలతో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు షాకుల మీద షాకులిస్తున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఓ మహిళా ఎమ్మార్వోకి చిన్న షాకిచ్చారు. ఏపీలో నిమ్మగడ్డకు ఓటు హక్కు లేదని ఆమధ్య వార్తలొచ్చాయి. తన సొంత గ్రామంలోనే ఓటరు లిస్ట్ లు తన పేరు తొలగించారంటూ ఆయన అధికారుల దగ్గర చెప్పినట్టు వార్తలు వచ్చాయి. అదే సమయంలో అధికార వైసీపీ నేతలు సైతం నిమ్మగడ్డపై మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉండే ఆయనకు ఏపీలో ఓటు హక్కు ఎందుకని నిలదీశారు. ఈ క్రమంలో ఆదివారం సొంత ఊరికి వచ్చిన నిమ్మగడ్డ ఓటు హక్కు గురించి పరోక్షంగా ప్రస్తావించారు.