పోలియో చుక్కలు వేయించుకున్న కొద్ది సేపటికే ఓ చిన్నారి మృతి చెందిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. తెలంగాణలోని మేడ్చల్-మల్కాజ్ గిరి జిల్లా దుండిగల్ మున్సిపాల్టీ పరిధిలోని మహేశ్వరం గ్రామంలో ఈ ఘటన జరిగింది. దీక్షిత అనే 16రోజుల పసి నెలల పాప పోలియో చుక్కలు వేయించుకున్న కాసేపటికే చనిపోయింది. చుక్కల మందు వికటించిందని, అందుకే తమ పాప చనిపోయిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. అయితే పోలియో మందులో ఎలాంటి ఇబ్బంది లేదని, పాప అనారోగ్యం వల్లే అలాంటి పరిస్థితి తలెత్తిందని అంటున్నారు వైద్యులు.